వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జున పై 26,498 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. సీనియర్ నేత కావడం, ఇది వరకు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఈయన తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన బొత్స అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు.
రాజకీయ నేపథ్యం..
1992 నుండి 1999 వరకూ విజయనగరం డీసీసీబీ చైర్మన్,
1996 నుంచి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి
1999 ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా
2004,2009 ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ విజయం
2004లో వైఎస్సార్ కేబినెట్లో భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సేవలు
రోశయ్య కేబినెట్లో పంచాయతీరాజ్, కిరణ్ కుమార్రెడ్డి కేబినెట్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు
2012-2015 వరకు పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈయన భార్య బొత్స ఝాన్సీ ఒకసారి ఎంపీగా గెలిచారు.
ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా ఉన్నారు. సీనియర్ గా వైసీపీ విజయంలోనూ కీలకపాత్ర పోషించారు.
