నవ్యాంధ్ర హోమ్ మంత్రిగా మహిళా ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎంపిక చేశారా..?. గతంలో ఉమ్మడి ఏపీలో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిను హోమ్ మంత్రిగా నియమించిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను గెలుపొందిన సంగతి విదితమే. అయితే రేపు శనివారం ఉదయం సచివాలయంలో నవ్యాంధ్ర నూతన మంత్రులు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాష్ట్ర తొలి హోం మంత్రిగా మహిళా ఎమ్మెల్యేను నియమించాలని ముఖ్యమంత్రి జగన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఆయన తాజాగా హోం మంత్రిగా మహిళను నియమించారని తెలుస్తోంది. అయితే ఇంతకీ ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు..? హోం శాఖ బాధ్యతలు స్వీకరించే అదృష్టవంతురాలు ఎవరు..? అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మొత్తం 09 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు దాదాపు ఖరారు అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడనుందని సమాచారం. అయితే అంతకుముందు ఈ రోజు శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన రోజా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేయడంతో కచ్చితంగా హోంశాఖ ఆమెనే వరించిందని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు