ఏపీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో నూతన మంత్రి వర్గం రేపు శుక్రవారం ఉదయం 11.49గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లను సచివాలయం పక్కన చేస్తోన్నారు సంబంధిత అధికారులు..ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కొంతమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా నూతన మంత్రులుగా ఖరారైన వారికి జగనే స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారని వినికిడి. ఈ మేరకు మాజీ మంత్రి బోత్స సత్యనారాయణ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,గౌతమ్ రెడ్డి,సుచరిత,ఆర్కే రోజాలకు ఒక్కొక్కరికి ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ చేసి చెప్పగా .. జగన్ కన్ఫామ్ అయినట్లు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే మొత్తం ఇరవై ఐదుమందిని జగన్ తన టీమ్లోకి తీసుకుంటున్నారు.వారంతా రేపు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
