ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఏపీలో వైసీపీ పార్టీ గెలిచిన విజయం మామోలు విజయం కాదని చెప్పాలి ఎందుకంటే..మొత్తం 175స్థానాలకు గాను ఏకంగా రికార్డు స్థాయిలో 151సీట్లు గెలుచుకుంది.అంతేకాకుండా 25ఎంపీ స్థానాలకు గాను 22సీట్లు గెలుచుకొని దేశాలోనే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీగా మూడో స్థానంలో నిలిచింది.ఒక ప్రతిపక్ష పార్టీ అయిఉండి కూడా అధికార టీడీపీ పార్టీని ఇంత చిత్తుగా ఓడించడం రికార్డనే చెప్పాలి.వైసీపీ గెలిచిన అనంతరం ప్రధాని మోడితో తో సహా దేశంలోని ముఖ్యనేతలు జగన్ కి ఫోన్ చేసి మరీ విషెస్ తెలిపారు.ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జగన్ కు విషెస్ తెలిపారు.సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ కు చంద్రబాబు జగన్ కు ఒక లేక రాసిన విషయం అందరికి తెలిసిందే
ఇందులో ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు తన నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయం గురించి చర్చించారు.అయితే టీడీపీ మంత్రి మాజీ ఆర్థిక మంత్రి మాత్రం దానిని తప్పుదోవ పెడుతున్నారు.దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి పేరుకు ఆర్థిక మంత్రిగా ఉన్నా అంతా కుటుంబరావే చూసుకోవవడం వల్ల యనమలకు లెక్కలపై పట్టుతప్పింది. ప్రజావేదిక కేటాయించాలని బాబు రాసింది మొదటి లేఖ కాదు. శుభాకాంక్షలు తెలిపేందుకు రాసింది ఫస్ట్ లెటర్ అని సమర్ధించబోయారు. మరి బాబు రాసిన లేఖపై DO లెటర్ 1/2019 అని ఎందుకుందో చెప్పాలి అని యనమలను ప్రశ్నించారు.