ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు విలవిల కొట్టుకున్నారు.అయితే వైసీపీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయకముందే తన బాద్యతలను నిర్వహించారు.ఇక ప్రమాణస్వీకారం అనంతరం యువ కెరటంలా రెచ్చిపోయి తనదైన శైలిలో పనులు చేస్తున్నారు.ప్రస్తుతం జగన్ రాష్ట్రంలో పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థకు అనుమతినిచింది.ఇప్పటికే టెండర్లలోఅవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.నీతివంతమైన పాలన అందించడమే లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం..ఈ నేపధ్యంలో సీబీఐ కి అనుమతులు జారీ చేసింది.ఈ కీలక నిర్ణయం తీసుకుకున్న జగన్ కు అన్నిచోట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు
.ఇది ఇలా ఉంటే అప్పట్లో చంద్రబాబు హయంలో నవంబర్ నెల 2018లో సీబీఐ సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ జీవో పాస్ చేసిన విషయం అందరికి తెలిసిందే.తాను చేసిన అన్యాయాలు,అక్రమాలు బయటపడతాయని భయపడే చంద్రబాబు ఇలా చేసాడని విమర్శలు కూడా వచ్చాయి.అంతేకాకుండా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర బయట పడుతుందని చంద్రబాబు భయపడి ఇలా చేసాడని తెలుస్తుంది.ఇక ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇవ్వడంతో టీడీపీ నాయకుల్లో భయం మొదలైంది.సాక్షాత్తూ టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకి కూడా చమటలు పడుతున్నాయి.