ఏపీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో నూతన మంత్రి వర్గం రేపు శనివారం ఉదయం 11.49గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లను సచివాలయం పక్కన చేస్తోన్నారు సంబంధిత అధికారులు..ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కొంతమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం.ఏపీ స్పీకర్ గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తమ్మినేని సీతారాంకు దాదాపు ఖరారు అయినట్లే అని తెలుస్తుంది.వైఎస్సార్ఎల్పీ సమావేశం అనంతరం తమ్మినేని సీతారం వైఎస్ జగన్తో భేటీకావడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.అంతేకాకుండా ఈయన మాజీ మంత్రి కావడంతో అనుభవం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.