ప్రపంచకప్ లో భాగంగా నిన్న బుధవారం భారత్,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది.ఎంతో ఉత్కంతభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు విజయం భారత్ నే వరించింది.ముందుగా టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాట్టింగ్ తీసుకుంది.ఇందులో ఇంకొక విచిత్రం ఏమిటంటే ఆడిన మూడు మ్యాచ్లలో సఫారీలు టాస్ గెలిచారు గాని విజయం సాధించలేదు.ముందు రెండు మ్యాచ్ లలో చేసింగ్ చేయలేకపోయారు,ఈ మ్యాచ్ లో భారీ టార్గెట్ ఇవ్వలేకపోయారు.అయినప్పటికీ నిర్ణిత 50ఓవర్స్ లో 227పరుగులు చేసారు.అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ ఆదిలోనే ధావన్ వికెట్ కోల్పోయింది.అనంతరం వచ్చిన కోహ్లి రోహిత్ తో కలిసి కాసేపు ఆడి అవుట్ అయ్యాడు.దీంతో రన్ రేట్ కొంచెం తగ్గింది.ఆ తరువాత మాజీ సారధి ధోనితో కలిసి రోహిత్ స్కోర్ ని ముందుకు నడిపించాడు.ఈ క్రమంలోనే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.అంతేకాకుండా 12000పరుగులు పూర్తి చేసుకొని భారత్ విజయం లో కీలక పాత్ర పోషించాడు.