వైవీ సుబ్బారెడ్డి..2014ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు.2019ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీని పక్కన పెట్టడం జరిగింది.అయినప్పటికీ ఆయన దిగులు చెందలేదు తన త్యాగానికి ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి.ప్రస్తుతం ఇప్పుడు అందరు జగన్ గెలుపు కోసం తన సీట్ త్యాగం చేసిన బాబాయ్ కి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారని చర్చించుకుంటున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల టీటీడీ పాలక మండలిని ప్రభుత్వం రద్దు చేసింది.ప్రస్తుతం పదవికి వైవీ సుబ్బారెడ్డి ముందు రేస్ లో ఉన్నారు.అంతేకాకుండా జగన్ కి బాబాయ్ కావడంతో మరియు పార్టీ గెలుపు కోసం సిట్టింగ్ ఎంపీ పదవిని త్యాగం చేయడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకునట్లు సమాచారం.ఇక టీటీడీ జేఇఓ గా ధర్మారెడ్డిని నియమిస్తున్నట్టు సమాచారం.