ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు అనగా బుధవారం ఇండియా,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.ఇప్పటిదాకా అన్ని జట్లు మ్యాచ్ లు ఆడగా ఒక్క ఇండియా మాత్రం ఆడలేదు.భారత్ కూడా ఇదే మొదటి మ్యాచ్.ఇండియా తో తలబడుతున్న సఫారీ జట్టుకు మాత్రం ఇది మూడో మ్యాచ్ కాగా ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.మరి ఈరోజైన ఆ జట్టుకు విజయం వరిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.ఇక ఇండియా పరంగా చుస్కుంటే ఇదే మొదటి మ్యాచ్ కావడంతో ఎలా ఉండబోతుందని అంచనా వేయలేము.కాని మన బ్యాట్టింగ్ లైన్ అప్ మాత్రం గట్టిగా ఉందని చెప్పాలి.అలాగని సౌతాఫ్రికా గట్టిగా లేదు అని కాదు అన్ని విధముల ఆ జట్టు కూడా బాగానే ఉందని చెప్పాలి.వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోవడంతో ఇప్పుడు చాలా కసిగా ఆడుతారని చెప్పవోచ్చు.ఈ మ్యాచ్ లో టాస్ కూడా కీలకమే అని చెప్పాలి.
