తెలంగాణ వ్యాప్తంగా నిన్న మంగళవారం విడుదలైన జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెల్సిందే. ఇందులో టీఆర్ఎస్ 3,571ఎంపీటీసీ,449జెడ్పీటీసీలను గెలుపొంది రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండుకు ముప్పై రెండు జెడ్పీ స్థానాలను కారు తన ఖాతాలో వేసుకుంది.ఈ క్రమంలో తన్నీరు హారీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట జిల్లా మరోసారి తన విశిష్టతను చాటుకుంది.
జిల్లా మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుండి తన్నీరు హారీష్ రావు చేసిన కృషి,హార్డ్ వర్క్ తోడూ స్థానిక నేతల ,కార్యకర్తల ,ప్రజల సహాకారంతో జిల్లాలో ఉన్న ఇరవై మూడు జెడ్పీటీసీ స్థానాలకు గానూ ఏకంగా ఇరవై రెండు స్థానాల్లో గులాబీ అభ్యర్థులు దూసుకుపోయారు.
అంతేకాకుండా 22 స్థానాలు అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలిపించి మరో సారి సీఎం కేసీఆర్ గారి నాయకత్వానికి పట్టం కడుతూ తన్నీరు హారీష్ రావు మార్గనిర్ధేశకం ఏమిటో చాటి చెప్పారు సిద్దిపేట ప్రజలు. సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ఐదు జెడ్పీటీసీ స్థానాలకు.. 5 స్థానాలను టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.ఈ క్రమంలో జిల్లాలోని చిన్నకోడూరు జెడ్పీటీసీగా సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు వేలేటి రాధాకృష్ణ శర్మ సతీమణీ వేలేటి రోజాశర్మ ఏకంగా 15,303ఓట్ల మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలో అత్యంత మెజారిటీతో గెలుపొందిన అభ్యర్ధిగా ఆమె రికార్డు సృష్టించారు.