ప్రపంచకప్ లో భాగంగా నిన్న మంగళవారం శ్రీలంక,ఆఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.ముందుగా టాస్ గెలిచి నైబ్ ఫీల్డింగ్ తీసుకోగా..బ్యాట్టింగ్ కు వచ్చిన శ్రీలంక ఓపెనర్స్ ఆదినుండి విరుచుకుపడ్డారు.కుసాల్ పెరేరా తనదైన శైలిలో ఆడడంతో పరుగులు వరద పారింది.అయితే నబీ వేసిన ఓవర్లో శ్రీలంకకు బ్రేక్ పదిడింది అంతే అక్కడనుండి ప్లేయర్స్ అందరు వరుస క్రమంలో పెవిలియన్ బాట పట్టారు.చివరి వరకు గ్రీజ్ లో ఉన్న పెరేరా ఒక్కడే ఒంటరి పోరాటం చేసాడు.అయితే ఆట మధ్యలో వర్షం రావడంతో మ్యాచ్ 41ఓవర్లకే కుదించారు.శ్రీలంక నిర్ణిత ఓవర్స్ లో 201పరుగులకే అల్లౌట్ అయ్యింది.అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన ఆఫ్ఘానిస్తాన్ ఓపెనర్స్ మంచిగా ఆడిన వర్షంతో పిచ్ మొత్తం మారిపోయింది.దీంతో శ్రీలంక బౌలర్స్ కి ఫుల్ సపోర్ట్ గా మారిపోయింది.చివరకు శ్రీలంకనే విజయం వరించింది.