ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసంకోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు తన నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయం గురించి చర్చించారు.
గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం అందరికీ అందుబాటులో లేకపోవడంతో విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు మరో భవనాన్ని చూడాలని కేశినేని నాని, దేవినేని ఉమకు సూచించారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు పాత R&B గెస్ట్ హౌస్ ను కేటాయించారు.. ఈరోజు అదే చంద్రబాబు ప్రభుత్వసొమ్ము రూ.5కోట్లతో కట్టిన ప్రజావేదికను తనకు అధికార నివాసంగా ఇవ్వమని జగన్ కు ఉత్తరం రాసాడు. అలాగే స్పీకర్ ని నిర్ణయించే పదవిని కూడా.. తనకు తానే ఇచ్చేసుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నాడు.