ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పాలనలో అటు ప్రజాసంక్షేమంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్కారు దవఖానాలు,రాజధాని ప్రాంతంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అంగన్ వాడీలకు ప్రస్తుతం ఉన్న మూడు వేల రూపాయల నుండి ఏకంగా మూడు రెట్లు అంటే పదివేలకు పెంచారు. కిడ్నీ బాధితులకు నెలకు పదివేల ఆర్థిక సాయమిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
తాజాగా తన కేరీర్లోనే ఎటువంటి అవినీతి అక్రమాల మచ్చలేని ప్రభుత్వ అధికారిగా ఎంతో నిజాయితీపరుడుగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ప్రముఖ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అయిన అజయ్ కల్లంను సీఎంఓ సలహాదారుగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.అయితే రాష్ట్ర విభజన తర్వాత అధికారంలో ఉన్న టీడీపీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు చేసిన కుంభకోణాలను అజయ్ కల్లం నిర్భయంగా బయటపెట్టారు. అయితే సాధారణంగా ఎవరన్నా అధికారులు ప్రభుత్వ సలహాదారుగా నియమితులవుతారు.
ఇక్కడ అందర్నీఆశ్చర్యపరుస్తూ అజయ్ కల్లం ను ముఖ్యమంత్రి సలహాదారుగా చెప్పడం ద్వారా సీఎంఓ లో అన్ని బాధ్యతలు ఆయనే చూస్తారని ఆర్ధమవుతుంది. జగన్ కు కీలకమైన విషయాలలో ఆయన సలహాలు ఇస్తారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సలహాలు, సూచనలు ఇస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అజేయ కల్లం మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని, ఆయన వేతనాన్ని రూ.2.5లక్షలుగా పేర్కొంది. అజేయ కల్లం పేషీకి 10 మంది సిబ్బందిని సమకూరుస్తూ ఉత్తర్వలు ఇచ్చారు. ఇది ఒకరకంగా చెప్పాలంటే కొత్త వ్యవస్థ అని భావించాలి. ఇది
విజయవంతం అయితే భవిష్యత్తులో ఈ ట్రెండ్ కొనసాగుతుంది.