ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష చేయాల్సిఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దుచేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కాగా జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్నెల్లలో మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం నుంచే వరుస భేటీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలతో బిజిబిజీగా గడుపుతున్నారు. పాలన పారదర్శంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
