ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో… 22ఎంపీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. దీంతో నవ్యాంధ్ర రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో చాలా సాధారణంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుండి పాలనలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. అయితే ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గత అరవై ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలకు వైసీపీ పన్నెండు ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది. అంతేకాకుండా జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.
ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదో తారీఖున ఏపీ కొత్త క్యాబినేట్ కొలువు దీరనున్నది. అయితే జగన్ తన టీమ్ లోకి ఈ జిల్లా నుండి ఎంతమందిని తీసుకుంటాడన్నదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ శ్రేణుల సమాచారం మేరకు సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీచేసిన టీడీపీ తరపున పోటి చేసిన నందమూరి బాలకృష్ణపై ఓడిపోయిన మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని వైసీపీ అధినేత విఅఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకూ జిల్లాకు చెందిన అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాయదుర్గానికి చెందిన కాపు రామచంద్రారెడ్డి, పెనుకొండకు చెందిన శంకర నారాయణకు అవకాశాలు దక్కవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శింగనమల : బీ రుక్మిణీ దేవి (జనతాపార్టీ), పీ శమంతకమణి (కాంగ్రెస్), కే జయరాం (టీడీపీ), డాక్టర్ శైలజానాథ్ (కాంగ్రెస్),తాడిపత్రి నుంచి చల్లా సుబ్బరాయుడు(కాంగ్రెస్), జేసీ దివాకర్ రెడ్డి (కాంగ్రెస్),ఉరవకొండ నుంచి గుర్రం చిన్న వెంకన్న (కాంగ్రెస్), గుర్రం నారాయణప్ప (టీడీపీ),రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు (టీడీపీ)మంత్రులుగా పని చేశారు.
కళ్యాణదుర్గం నుంచి ఎం. లక్ష్మీదేవి (కాంగ్రెస్),హిందూపురం నుంచి బీ రుక్మిణీదేవి (కాంగ్రెస్), జీ సోమశేఖర్ (కాంగ్రెస్), ఎన్టీ రామారావు (టీడీపీ),మడకశిర నుండి బీ రుక్మిణీదేవి (కాంగ్రెస్), హెచ్‌బీ నర్సేగౌడ్ (టీడీపీ), ఎన్. రఘువీరారెడ్డి (కాంగ్రెస్),కదిరి నుండి మహమ్మద్ షాకీర్ (టీడీపీ), నిజాంవలి (కాంగ్రెస్),ధర్మవరం నుంచి జీ నాగిరెడ్డి (టీడీపీ), పీవీ. చౌదరి (కాంగ్రెస్),పుట్టపర్తి నుంచి పద్వా భాస్కర్‌రెడ్డి (గోరంట్ల, కాంగ్రెస్), నిమ్మల కిష్టప్ప (గోరంట్ల, టీడీపీ), అగిశం వీరప్ప (నల్లమాడ, కాంగ్రెస్), పల్లె రఘునాథరెడ్డి (టీడీపీ),పెనుకొండ నుంచి ఎస్. రామచంద్రారెడ్డి (టీడీపీ), పరిటాల రవీంద్ర (టీడీపీ),రాప్తాడు నుంచి పరిటాల సునీత (టీడీపీ)లకు మంత్రి పదవులు లభించాయి. అయితే ఇప్పటి వరకుజరిగిన సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే అనంతపురం అర్బన్, గుంతకల్లు నియోజకవర్గాలు ఇప్పటివరకూ మంత్రి పదవుల ముఖమే ఎరుగలేదు.దీన్నిబట్టి చూస్తే అనంతపురం అర్బన్ (అనంత వెంకట్రామిరెడ్డి) నియోజకవర్గానికి జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి అవకాశం లభిస్తే.. అది రికార్డుకెక్కే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు..