ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆరోజున తిరుపతికి వస్తుండటంతో ప్రధానికి స్వాగతం పలకడంతో పాటు సీఎం ఆయనతే భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజనహామీలు అమలు చేయాలని ప్రధానిని జగన్ను కోరనున్నారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం సీఎం ఈనెల 15వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రత్యేకహోదాతో పాటు కేంద్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆర్థికలోటుపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. జగన్మోహన్ రెడ్డి సమావేశంకోసం ఏపీకి నిధుల కోసం, ప్రత్యేకహోదాకోసం రాష్ట్ర ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.