తొలిసారిగా 1983లో బొబ్బిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రస్తుతం వైయస్సార్ సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1994తరువాత ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ప్రొటెం స్పీకర్ గా అసెంబ్లీలో అత్యంత సీనియర్ నేతలకే అవకాశం వస్తుంది. దీంతో 1978లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో చంద్రబాబు ఒక్కరే ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1983లో గెలిచినవారిలో బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం, సంబంగి వెంకట అప్పలనాయుడు ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో అత్యంత సీనియర్ గా బాబే ప్రొటెం స్పీకర్ గా ఎమ్మెల్యేలచేత ప్రమాణం చేయించాలి. కానీ ఈ కార్యక్రమం నుండి తప్పించుకునేందుకే చంద్రబాబు విదేశీ ప్రయాణం పెట్టుకుని ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ ను అసెంబ్లీకి రాడు.. సమస్యల పై చిత్తశుద్ధిలేదు.. జీతాలు తీసుకుంటారు అంటూ 2ఏళ్ల పాటు విమర్శించిన చంద్రబాబే అవమాన భారంతో అసెంబ్లీ తొలి సమావేశాలకు హాజరుకాకపోవడం కచ్చితంగా నైతికంగా చంద్రబాబు మరోసారి ఓడిపోయారని చెప్పుకునేలా చేస్తుంది.
