రంజాన్ పండగ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడునుత్యజించడం, మానవులకు సేవలాంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’, నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే ఈ సందర్బంగా ముస్లింసోదర సోదరీమణులకు వైఎస్ జగన్ ఆత్మీయ శుభాభినందనలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.