ఆనాడు పులివెందుల వేదికగా వైఎస్ కుటుంబాన్ని దూషిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అగ్రపీఠం వేస్తారని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భావించారు. అధికారానికి ఆయనలోని అహంకారం జత కలిసింది. అప్పటినుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 2017 జనవరి 12న సింహాద్రిపురం మండలం పైడిపాళెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సాక్షిగా వైఎస్ కుటుంబసభ్యుల్ని చెప్పుతో కొట్టాలని మంత్రి బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలకు యావత్తు ప్రజానీకం విస్తుపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఎంపికై ఆ పార్టీ పదవి అనుభవిస్తూ ఆదిరించిన కుటుంబాన్ని దూషించడాన్ని జిల్లా వాసులు తట్టుకోలేకపోయారు. కలత చెందారు. తాజా ఎన్నికల్లో ప్రజలు తీర్పుతో బదులిచ్చారు. ఆదితో టీడీపీ అభ్యర్థులందరినీ దారుణంగా ఓడించారు. 2014 ఎన్నికల్లో వరకూ ప్రత్యక్ష రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాసులరెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో 1,90,323 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి స్వయంగా పోటీచేసి అవినాష్‌రెడ్డి చేతిలో 3,80,976 ఓట్లు తేడాతో ఓడిపోయారు. రాజకీయాల్లో తనకే చతురత ఉందని, వరుసగా మూడుసార్లు తాను కాబట్టే జమ్మలమడుగులో గెలిచానని భావించే ఆదినారాయణరెడ్డికి ఈసారి ఎంపీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. జమ్మలమడుగులోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి 51,641 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనిని బట్టి ఆది పట్ల ప్రజలు ఏ స్థాయిలో కసితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. అంతేకాదు జిల్లాలో టీడీపీ భారీ ఓటమికి ఆది ప్రధాన కారకుడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో 20 ఏళ్లు కడపలో టీడీపీ గెలవకుండా చేశాడాని వైసీపీ అభిమానులు అంటున్నారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ ని వదిలి బీజేపీలో చేరాలని నిర్ణయానికి వచ్చారట. అందుకే ఆదినారాయణ రెడ్డి ఏపీ కమల నాదులతో పాటు ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వారు టచ్ లోకి రాకపోతే ఇక రాజకీయాలకు గుడ్ డై చెప్పేస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతంది.
