ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు.. అక్కడినుంచి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే ఎక్కడా లేని విధంగా పలువురు మహిళలను తీసుకువచ్చి చంద్రబాబుతో కలిపించి మాట్లాడించి డైలీ పేపర్లలో పడేలా టీడీపీ ఓ కార్యక్రమం చేస్తోంది.. డైలీ “తెదేపా అధ్యక్షులు చంద్రబాబును కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. పరిస్థితులు ఏవైనా తామంతా చంద్రబాబు వెంటే ఉంటామని వారంతా సంఘీభావం వ్యక్తం చేశారు” అనే వార్తలు రాస్తున్నారు. ఇక్కడివరకూ బాగానే ఉంది.. అయితే తాజగా మరో పోస్టింగ్ చంద్రబాబు ఫేస్ బుక్ వాల్ పై కనిపించింది. అదిచూసి అందరూ అవాక్కవుతున్నారు.
అదేమిటంటే “కృష్ణాజిల్లా గన్నవరం నుంచి చంద్రబాబును కలిసేందుకు తన తల్లిదండ్రులతో వచ్చిన నాలుగేళ్ళ భానుశేఖర్, చంద్రబాబును చూడగానే.. తాను పెద్దయ్యేసరికి ఏపీ నెంబర్ వన్ కావాలని, ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని అనడంతో చంద్రబాబు నవ్వుతూ బాబును దగ్గరకు తీసుకుని కాసేపు సరదాగా మాట్లాడారు” అనే పోస్టును పెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో నవ్వుల వర్షం కురుస్తోంది.. ఇంకా ఎన్నిరోజులు భరించాలి ఈ సోది.. సిగ్గులేదా.. నాలుగేళ్ళ పిల్లాడు తల్లుదండ్రులను తీసుకుని నీ దగ్గరకు వస్తాడా.? లేదా తల్లుదండ్రులే వచ్చేటపుడు తమ పిల్లాడిని తీసుకు వస్తారా.? ఆపసి వాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, డెవలప్ మెంట్ గురించి మాట్లాడతాడా అని ప్రశ్నిస్తున్నారు. ఏకంగా చంద్రబాబు అధికారిక అకౌంట్ లోనే కాంమెంట్లు పెట్టి ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ల పిల్లాడి గురించి ఎందుకు అబద్ధాలు చెప్పడం.. పసిపిల్లలను రాజకీయాల్లోకి లాగుతారా అని ప్రశ్నిస్తున్నారు. పసుపురంగు బట్టలు వేసి నాటకాలాడుతూ ఇంకా ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యతిరేకతను చేసిన టీడీపీ టీం ఈ పోస్ట్ ని డిలీట్ చేసారు.