ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానెప్పుడూ ప్రజల మనిషేనని మరోసారి రుజువు చేశారు. ప్రజలగుండె చప్పుడు తాను విన్నాను.. తాను ఉన్నానని చాటిచెప్పారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యానర్ పట్టుకున్న కొంతమంది యువతీ, యువకులను జగన్ చూసారు. కానీ చూసీ చూడనట్టు వెళ్లిపోలేదు.. వారిని చూసిన జగన్ వెంటనే కాన్వాయ్ ఆపి కిందికి దిగి నేరుగా వారి వద్దకే వెళ్లారు.
కొందరు విద్యార్ధులు తమ స్నేహితుడు నీరజ్ కుమార్ ఆపరేషన్‌కు రూ. 25లక్షలు ఖర్చవుతుందని, 30వ తేదీలోపు అతడికి ఆపరేషన్ చేయించాలని ముఖ్యమంత్రితో చెప్పారు. వారి మాటల్ని విన్న జగన్ జగన్ ఆపరేషన్‌కు వెంటనే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి మానవత్వంతో స్పందించి తమ స్నేహితుడికి సాయం చేస్తామని చెప్పడంతో నీరజ్ మిత్రులంతా సంతోషం వ్యక్తంచేశారు. జగన్ లాంటి మంచి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని, ఆయనకు చేతులెత్తి మొక్కుతున్నామంటున్నారు.