అనంతపురం జిల్లాలో కియా కార్ల పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హెచ్చరించారు. సోమవారం ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని, అక్కడ అంతా తమిళులే, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయన్నారు. దొంగ ఏడుపులు వద్దని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఏం చేయాలో తెలుసని, కియా పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని హెచ్చరించారు. ఇక అంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాల అద్దే విషయంలో జరిపిన అవినీతిని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. అక్కడ అంతా తమిళులే అని, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయి. దొంగ ఏడుపులు వద్దు. యువ సీఎంకు ఏం చేయాలో తెలుసు. కియా పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 4, 2019