Home / 18+ / కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.. కేసీఆర్

కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.. కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..
‘‘తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల తరబడి అనుభవించిన సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో వున్నారు. రైతులకు సాగునీరందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. కోటికి పైగా ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమురు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ఎత్తపోతల పథకాలను నిర్మిస్తున్నది. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. దాదాపు 80శాతం జిల్లాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టు ఇది.

ఒక్కసారి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. అందుకే ప్రభుత్వం ఎక్కడా నిధుల కొరత రాకుండా, భూసేకరణ సమస్య లేకుండా, విధాన నిర్ణయాల్లో జాప్యం జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నది. దాని ఫలితంగానే ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. కాళేశ్వరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి 15-20 ఎండ్లు పడుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల అతి తక్కువ సమయంలోనే ప్రధానమైన బ్యారేజీలు పంపుహౌజ్ లు నిర్మించి గోదావరి నీటిని ఎత్తి పంట పొలాలకు తరలించనున్నది. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతం.

వచ్చే నెల నుండే నీటి పంపింగ్ ప్రారంభించాల్సి వున్నందున అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలి. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో వుందో గ్రహించి అధికారులు, వర్క్ ఏజెన్సీలు కూడా ప్రాణం పెట్టి పనిచేయాలి. చివరి దశలో మరింత అప్రమత్తంగా వుండాలి. ఒక సారి నీటి పంపింగ్ ప్రారంభమయితే కొన్ని బాలారిష్టాలు (Teething problems) ఎదురవుడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ప్రాజెక్టును పట్టిష్టంగా నిర్వహించాలి. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో దానిని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat