ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. టీడీపీ 23 కేవలం స్థానాలకు పరిమితమయ్యింది. జనసేన పార్టీ కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. అయితే 175 జకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో పాటు జగన్మోహనరెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. అయితే టీడీపీలోకి ఫిరాయించిన 23మందితో టీడీపీ సరిపెట్టుకోగా, ఫిరాయించిన ముగ్గురు ఎంపీల సంఖ్యే టీడీపీ తరపున గెలిచారు. అదికూడా 23వ తారీఖున.. ఇదిలా ఉంటే.. గతంలో వైఎస్సార్ చనిపోయినపుడు 151మంది ఎమ్మెల్యేలు జగనే సీఎంగా ఉండాలని సంతకాలు సేకరించి కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు.. ఇప్పుడు కూడా 151మంది ఎమ్మెల్యేలు జగన్ తరపున గెలిచారు. విధి మహత్యమేమొటో గానీ అన్నీ అంకెలు జగన్ కు కలిసొస్తున్నాయని వైసీపీ శ్రేణులు ఫీలవుతున్నారు. అలాగే దైవం, పైనున్న వైఎస్సార్ జగన్ ను ఆశీర్వదిస్తున్నారని చెప్తున్నారు.
