ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయినా టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం గుంతపల్లిలో పరిటాల శ్రీరామ్ అనుచరులు రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్త ప్రతాప్‌కు ఫోన్ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాయలేని అసభ్య పదజాలంతో బాంబులు వేస్తామని, కొడవళ్లతో నరికి చంపేస్తామంటూ శ్రీరామ్ అనుచరుడు అమర్నాథ్, మరో ముగ్గురు బెదిరింపులకు దిగారు. ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో ఫైల్‌ను పోలీసులతో పాటు మీడియాకు కూడా అందజేశారు. ఆడియో కోసం క్రింద లింక్ ఒపెన్ చెయ్యండి
