తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అంటే ఆయన ఎక్కడ ఏ సభ అయిన సరే ఒక చిన్న పిల్లాడి మాదిరిగా మారిపోయి సభికులను అందర్నీ ఆనందంగా ఉంచడానికి ఉత్సాహభరితమైన ప్రసంగాలతో.. తీరైన డాన్సులతో అందరి మన్నలను పొందుకుంటారు అని మనకు తెల్సిందే. అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి చేసిన పనికి యావత్తు నెటిజన్ లోకం ఫిదా అయింది.
నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలోని బాలానగర్లో నర్సాపూర్ చౌరస్తాలో బాలానగర్ రాజు కాలనీకి చెందిన మేస్త్రీగా పనిచేస్తున్న బాలస్వామి సైకిల్ పై ఒక వ్యక్తిని కలిసేందుకు వస్తున్న సమయంలో అటుగా వస్తోన్న లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగుల్లో పడి ఉన్నాడు.
అదే సమయంలో బోయినపల్లి నుంచి కూకట్పల్లికెళ్తున్న మంత్రి మల్లారెడ్డి దీనిని చూసి మరి తన కాన్వాయ్ ను నిలిపివేయించారు. వెంటనే కారు దిగొచ్చి మరి తానే స్వయంగా కాన్వాయ్లోకి ఎక్కించి మరి సూరారంలో ఉన్న తన ఆసుపత్రి మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి చేసిన పనికి స్థానికులతో పాటుగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.