తెలుగుదేశం పాలనలె కుదేలైన ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు సీఎం జగన్ నడుం బిగించారు.. అందరూ ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్ధికస్థితి చక్క దిద్దడానికి మంచి ఆలోచన విధానాలతో రావాలని ఆయనకోరారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై గతంలో తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేలా 15వ ఆర్ధికసంఘం ముందు సమర్థవంతంగా ఏపీ వాదన వినిపించాలని, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ సమగ్రమైన నివేదిక తయారుచేసి హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలని జగన్ పేర్కొన్నారు. ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేలా చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
సామాన్యునిపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయవనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రీన్ టాక్స్, వ్యర్థపదార్థాలపైపన్ను, ఎర్రచందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సక్రమమైన ఇసుకవిధానం అమలు వంటి చర్యలద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలని జగన్ సూచించారు. ప్రస్తుతం తన ఇంట్లోని ఫర్నీచర్, కుర్చీలు, టేబుళ్లనే సమీక్షలకు వినియోగిస్తున్నారు. కొత్త ఫర్నీచర్ కొననివ్వలేదు. అలాగే ఇంట్లోనే అధికారులకు భోజనాలు పెడుతున్నారు. ప్రభుత్వ ఖజానాతో హోటళ్లనుంచి భోజనాలు రప్పించట్లేదు. తాను కూడా రూ.20 వాటర్ బాటిల్, రూ.20 పెన్ను మాత్రమే వినియోగిస్తున్నారు.