నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పట్టుమని పది రోజులు గడవకముందే పాలనలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు మినహా ఆ తర్వాత రోజునుండి పలు శాఖల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయని విధంగా సరికొత్త పంథాలో పనిచేస్తూ అందరి మన్నలను పొందుతున్నారు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.
ఇటీవల వైద్యారోగ్య శాఖ,స్త్రీ సంక్షేమ శాఖ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో ప్రస్తుతం సర్కారు ఆసుపత్రులల్లో నెలకొన్న సమస్యలను తీర్చే విధంగా ప్రణాళికలు రచించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత అంగన్ వాడీలకు ప్రస్తుతం ఉన్న జీతం మూడు వేల నుండి ఏకంగా పదివేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇక్కడే జగన్మోహాన్ రెడ్డి వ్యవహారించిన తీరుకు సంబంధిత అధికారులు షాక్ కు గురయ్యారు.
సమీక్ష సమావేశానికి వచ్చిన ఆధికారులను ప్రేమగా”పేరు పేరున అన్నయ్య తిన్నరా.. తినలేదా.. తినకపోతే తిని రండి.. మీకోసం ఎదురుచూస్తా”అని చెప్పడంతో సమీక్ష సమావేశాలకు వచ్చిన అధికారులు ఇన్నాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన కానీ ఏ ముఖ్యమంత్రి అడగని విధంగా తమ గురించి అడగటంతో భావోధ్వేగాలకు గురి అయ్యారు. అంతేకాకుండా అధికారులు లేచి నిల్చూని సంబంధిత శాఖల వివరాలు చెబుతుంటే ముఖ్యమంత్రి జగన్”అన్న కూర్చో.. మనం ఏమి చేసిన .. ఏమి మాట్లాడుకున్నా కానీ కూర్చునే మాట్లాడుకుందాం..ఒక కుటుంబం మాదిరిగా రాష్ట్రాభివృద్ధికై పని చేద్దాం”అని అనడం అధికారులంతా ఫిదా అయ్యారు. జగన్ ముఖ్యమంత్రిగా తమ పట్ల వ్యవహారిస్తున్న తీరుకు అధికారులే షాక్ కు గురై ఆనందంతో సమీక్ష సమావేశాలకు హాజరవుతున్నారు. ఆరు నెలల్లోనే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకుంటా అని హామీచ్చిన జగన్ ఇలాగే వ్యవహారిస్తే ఆరు నెలలకు ముందే బెస్ట్ సీఎంగా నిలవడం ఖాయమని అధికారులు మాట్లాడుకుంటున్నారు ఏపీ సీఎంఓలో..?