ఈ ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఫలితాలపై ఆ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే, మాజీ సీఎం చంద్రబాబు స్థానిక నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు మాట్లాడుతూ కుప్పంలో మొత్తానికి భలే బురిడీ కొట్టించారయ్యా అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు నవ్వుతూ వ్యాఖ్యానించినా పార్టీ నేతలకు సీరియస్ గా అనిపించింది. కుప్పంనుంచి పోటీచేసిన చంద్రబాబు ఓట్ల లెక్కింపు సమయంలో వైసీపీ అభ్యర్థికంటే వెనుకపడ్డారు. తర్వాత రౌండ్‌లో ఆధిక్యంలోకి వచ్చి గెలుపొందారు. అలాగే క్రితంసారితో పోల్చితే ఆయన మెజార్టీ బాగా తగ్గింది.
దీనిపై స్థానికనేతలు మాట్లాడుతూ, కుప్పంలో కొందరి నేతల వ్యవహారశైలి వల్లే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఏరియా, కోర్ కమిటీల నాయకత్వాన్ని మార్చాలన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెలాఖరున నేను కుప్పం వచ్చి నాలుగు రోజులు అక్కడే ఉంటాను. అపుడు జనాలను విస్తృతంగా కలవడంతో పాటు పార్టీ ప్రక్షాళన చేస్తాను. ఐ విల్ టేక్ కేర్ అన్నారు. నేతలకు, కార్యకర్తలు చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే సీఎం వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం కౌంటింగ్ రోజున చంద్రబాబు భయపడ్డారని అర్ధమయ్యిందని కుప్పం నేతలు చెప్పుకున్నారు.