ఏపీ ప్రభుత్వం మారడంతో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నవారిని తప్పించారు. తాజాగా మరి కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భారీగా బదిలీ కానున్నారు . జూనియర్ మొదలు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకు దాదాపు 70 మందికిపైగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేయనుంది. మరో నాలుగైదు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆయా అధికారుల నేపథ్యం, పనితీరు, గత ప్రభుత్వంలో వారు అనుసరించిన వ్యవహారశైలి లాంటి అంశాలను ముఖ్యమంత్రి జగన్ క్షుణ్నంగా పరిశీలించి, బదిలీలపై కసరత్తును కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కీలకమైన వైద్యం, జలవనరుల లాంటి శాఖలకు ముఖ్య కార్యదర్శుల ఎంపికపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది.
