ప్రపంచకప్ లో భాగంగా నిన్న సోమవారం హోమ్ టీమ్ ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు ఇంగ్లాంగ్ కెప్టెన్ మోర్గాన్.దీంతో బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదినుండి గట్టిగానే ఆడింది.ఓపెనర్స్ వికెట్ పడకుండా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.కొంతసేపటికి ఇమాం వెనుదిరగగా అనంతరం వచ్చిన బాబర్ అజమ్ మంచి బ్యాట్టింగ్ కనుబరిచాడు.కెప్టెన్ సర్ఫరాజ్ తో సహా ఆడిన ఆటగాలు అందరు బాగానే రాణించారని చెప్పాలి.ఫలితమే ఏకంగా నిర్ణిత 50ఓవర్స్ కి 348పరుగులు చేసారు.చేసింగ్ కి వచ్చిన ఇంగ్లాండ్ ఆదిలోనే ఓపెనర్స్ రాయ్ అవుట్ అయ్యాడు.ఆ కొద్దిసేపటికి ఇంకొక ఓపెనర్ కూడా అవుట్ అయ్యాడు.
దీంతో అభిమానులకు మ్యాచ్ పై ఆశలు సన్నగిల్లాయి.అయితే జో రూట్, బట్లర్ అద్భుతమైన బ్యాట్టింగ్ తో మ్యాచ్ ఫై ఆశలు కలిగించారు.ఇద్దరు అజేయంగా సెంచరీలు సాదించారు.చివరికి మ్యాచ్ మాత్రం ఓడిపోయారు.అయితే అసలు విషయానికి వస్తే మొన్న వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ లలో పాక్ మూడుసార్లు 300పైగా స్కోర్ చేసిన ఇంగ్లాండ్ దానిని చేదించింది.ఇప్పుడు కూడా అలానే జరుగుతుందని అందరు అనుకున్నారు.కాని ఓటమి తప్పలేదు.పాక్ ఈ మ్యాచ్ ముందు వరకు వరుసగా 11మ్యాచ్ లు ఓడిపోయింది.ఈ మ్యాచ్ గెలవడంతో పాక్ కు మరింత బలం వచ్చిందని చెప్పాలి.