ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ తలపడ్డాయి.అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు సఫారీ జట్టు కెప్టెన్ డుప్లేసిస్.దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ కు వచ్చారు.ఓపెనర్స్ తమీమ్ ఇక్బాల్,సౌమ్య సర్కార్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ ను ముందుకు నడిపించారు.ఆ కొద్దిసేపటికే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు.దీంతో బంగ్లాదేశ్ పని అయిపోయిందని అందరు అనుకున్నారు.అనంతరం వచ్చిన సఖీబ్,రహీమ్ మంచి భాగ్యస్వామ్యంతో టీమ్ ను ముందుండి నడిపించారు.చివరిలో మహామదుల్లా రెచ్చిపోవడంతో బంగ్లాదేశ్ నిర్ణిత 50ఓవర్లలో 330పరుగులు భారీ స్కోర్ సాధించింది.అనంతరం చేసింగ్ కు దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ డికాక్ ను కోల్పోయింది.తర్వాత వచ్చిన డుప్లేసిస్ ఓపెనర్ మక్రంతో కలిసి స్కోర్ ను ముందుకు నడిపించాడు.కొద్దిసేపటికి ఆ ఇద్దరు పెవిలియన్ బాట పట్టారు.చివర్లో డుమినీ ఒంటరి పోరాటం చేసిన ప్రయోజనం లేకపోయింది.సౌతాఫ్రికా తన మొదటి మ్యాచ్ లో కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోగా ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది.ఇప్పుడు కూడా అదే రిపీట్ అవ్వడం..అంతేకాకుండా బంగ్లాదేశ్ పై ఓడిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు.
