వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం సమగ్ర సమీక్ష చేపట్టారు. వైద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆరోగ్యవ్యవస్థను మెరుగుపరచి మంచి ఫలితాలు సాధించేవిధంగా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. అందరికి వైద్యం అందేలా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించ నున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వంవైద్యం అందాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇప్పటికే నివేదికలు తయారుచేసిన ఇరుశాఖల అధికారులు వాటిని సీఎంకు సమర్పించారు.
వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పథకాలను రూపొందించాలని ఇదివరకే నిర్ణయించిన విషయంతెలిసిందే. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖకు పెద్ద పీఠ వేస్తామని జగన్ అనేక సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రజలకు ఉచితవైద్యంపై కసరత్తు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం , వైద్యశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.అలాగే NTR వైద్యసేవ పేరుమార్చి వైయస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు