ఏపీలో జగన్ సునామీ ప్రభంజనం సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ కోలుకోలేకపోయింది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారు.టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు,మంత్రులు సైతం ఓటమి చవిచూశారు.ప్రతీ జిల్లాలోను వైసీపీదే ఆధిపత్యం సాగింది.టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటున్న జిల్లాలో కూడా వైసీపీనే విజయకేతనం ఎగరేసింది.ఇవన్నీ పక్కన పెడితే టీడీపీకి ఎదురులేని జిల్లా ఏదైనా ఉంది అంటే అది అనంతపురం అనే చెప్పాలి.అందులోను హిందూపురం నియోజకవర్గం వరకు చూసుకుంటే ఇక్కడ టీడీపీ నుండి బాలయ్య వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించాడు.ఇక్కడ దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పోటీ చేసి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
ఈసారి వైసీపీ అనంతపురం జిల్లాలో ఎక్కువ సీట్లు లు వచ్చినప్పటికీ హిందూపురంలో బాలయ్య గెలిచాడు.అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాని జిల్లా చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.ఈ నేపధ్యంలో అనంతపురం జిల్లా నుండి హిందూపురంను విడదీసి జిల్లా చెయ్యాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.ఈ పార్లమెంట్ నియోజికవర్గం పరిధిలో మూడు రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలు ఉన్నాయి.అంతేకాకుండా ఇది బెంగళూరుకు దగ్గరలో ఉండడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇదే గాని జరిగితే బాలయ్య బాబుకు తన నియోజకవర్గంలో పట్టు తగ్గిపోతుందని అందరు భావిస్తున్నారు.