జెర్సీతో మంచి విజయాన్ని అందుకున్న విమర్శకుల ప్రశంసలనే కాకుండా మంచి వసూళ్లను సాధించడంతో నానిలో మంచి జోష్‌ను పెంచింది. ఈ ఊపులోనే మరో రెండు పెద్ద ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు నాని. విక్రమ్ కే కుమార్‌తో తీస్తున్న గ్యాంగ్‌లీడర్ షూటింగ్ జరపుకుంటుండగానే.. ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉంచాడు.. అయితే శ్రీకాంత్ అడ్డాలతో నాని మరో సినిమాను చేయబోతోన్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం తరువాత గ్యాప్ తీసుకుని కూచిపూడివారివీధి అనే స్క్రిప్టును శ్రీకాంత్ రెడీ చేశాడని, అది నానికి కూడా వినిపించి ఓకే చేయించుకున్నాడని టాక్ వినిపించింది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులు నాని దృష్టికి తీసుకురాగా దీనిపై ఆయన ఓక్లారిటీ ఇచ్చారు. అదంతా అవాస్తవని, ఫాల్స్ న్యూస్ మై బాయ్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరి కాంబినేషన్‌లో ఆ చిత్రం రావడంలేదని ఎట్టకేలకు తేలిపోయింది.
