ఈ రోజు వారం ప్రారంభంలో తొలిరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం 200పాయింట్ల లాభంతో మొదలై సెన్సెక్స్ 553పాయింట్ల రికార్డు లాభంతో 40,267వద్ద ముగిసింది. 165పాయింట్ల లాభమ్టొ 12,088వద్ద నిఫ్టీ ముగిసింది. హీరో మోటోకార్ప్ ,బజాజ్ ఆటో,ఏషియన్ పెయింట్స్,ఇండస్ ఇండ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ ,టెక్ మహేంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు,ఎన్టీపీసీ ,భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అటు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69.27గా ఉంది.
