మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన నాటినుంచే గతంలో టీడీపీ నాయకులు చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణాలను నదీపరివాహప్రాంతంనుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు స్ఫూర్తితోనే స్థానిక తెలుగుదేశం నాయకుడు పాతూరి నాగభూషణం నదీతీరంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై ఆర్కే ఆగ్రహించారు.
కరకట్ట నుండి ర్యాంపునుకూడ ఏర్పాటుచేయడం పట్ల ఆర్కే స్పందిస్తూ.. ఈనిర్మాణం రివర్ కన్జర్వేషన్ యాక్ట్1872 ప్రకారం చట్ట వ్యతిరేకమని, అధికారులు ఇప్పటికైనా మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగుదేశం నాయకులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాలను, చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆర్కే మండిపడ్డారు. అయితే గెలిచిన నాటినుంచే ఆర్కే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించడం, క్రిమినల్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడంపట్ల మంగళగిరి వాసులు ఆర్కే డేరింగ్ ను మెచ్చకుంటున్నారు.