ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం పార్టీ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అందరికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.ప్రైవేటు వైద్యం కన్నా మించిన వైద్యం ప్రభుత్వ ఆశుపత్రిలో అందించాలని ఆయన అధికారులకు ఆదేశించనున్నారు.రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్ద పీఠ వేస్తామని అనేక సందర్భాల్లో జగన్ చెప్పగా..దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉచ్చిత వైద్యం అందేలా చేస్తామని అన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు ఈ సమవేశంలో పాల్గున్నారు.