రేపు ( జూన్ 3 ) మాజీ మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా హరీష్ రావు తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
” మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారములు.
నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న నేను హైదరాబాద్ లో కాని, సిద్ధిపేటలోకాని ఉండడంలేదు. మందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటుూ.. మీ అభిమానానికి మరోసారి తలవొంచి నమస్కరిస్తున్నా..
-మీ హరీశ్ రావు ” అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేశారు.
— Harish Rao Thanneeru (@trsharish) June 2, 2019