Home / SLIDER / ఫ‌లించిన కేటీఆర్ కృషి…స్వ‌దేశానికి స‌మీర్‌

ఫ‌లించిన కేటీఆర్ కృషి…స్వ‌దేశానికి స‌మీర్‌

దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ యువకుడికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీ నెర‌వేరింది. ట్వీట్ ద్వారా వ‌చ్చిన విజ్ఞ‌ప్తికి త‌క్ష‌ణం స్పందించిన కేటీఆర్‌…ఆయ‌న్ను విముక్తి చేసేందుకు చేసిన కృషి ఫ‌లితంగా త్వ‌ర‌లోనే ఆయ‌న స్వ‌గ్రామానికి చేరుకోనున్నాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన సమీర్ సౌదీకి వెళ్లాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సమీర్‌ను సౌదీకి పంపించాడు. అయితే.. అక్కడ యజమాని సమీర్‌ను గొర్రెల కాపరిగా పెట్టుకున్నాడు. తిండి కూడా పెట్టకుండా.. ఆ యజమాని సమీర్‌ను చిత్రహింసలు పెడుతుండటంతో ఏం చేయాలో తెలియని సమీర్.. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపడంతో పాటు.. వీడియో ద్వారా కేటీఆర్‌కు చేరవేశాడు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. సమీర్‌ను ఇండియా రప్పించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే సౌదీ అరేబియాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి ట్వీట్ చేసి..సమీర్‌ను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు.

కేటీఆర్ ట్వీట్‌పై గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప‌ట్కురి బసంత్ రెడ్డి దీనిపై స్పందించి సౌదీలోనే పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన కొందరు వర్కర్లకు అతడి జాడ కనుక్కునేందుకు పంపించారు. ఎడారిలో అతడి ఆచూకీని వెతుక్కుంటూ 500 కిలోమీటర్లు వెళ్లిన రాష్ట్ర వర్కర్లకు పాకిస్తాన్ వర్కర్లు సాయం చేయడంతో అతడు ఉన్న చోటును కనిపెట్టారు. అక్కడి నుంచి బయట పడేదాకా వెన్నంటే ఉండి సాయం చేసి యజమాని దగ్గరి నుంచి విముక్తి క‌ల్పించారు. ఇప్పుడు సమీర్ క్షేమంగా ఉన్నాడు. సమీర్ పరిస్థితిని పాకిస్తాన్ వర్కర్లకు వివరించడంతో సాయం చేశారని, అదును చూసి అతడిని బయటపడేశారని బసంత్ రెడ్డి అన్నారు.

సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీకి సమీర్ త్వ‌ర‌లో చేరుకోనున్నాడు. అక్కడి నుంచి ఇండియాకు సమీర్ రానున్నాడు. స‌మీర్ జాడ ప‌ట్టుకునేందుకు పాకిస్తాన్ వ‌ర్కర్లు చేసిన స‌హాయం ఫ‌లితంగా, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కృషి వ‌ల్ల స‌మీర్ త‌న స్వ‌గ్రామానికి చేరుకోనున్న‌ట్లు వివ‌రించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat