ఎమ్మెల్యే కాగానే కోట్లకు పడగలెత్తడం కొత్తేమీ కాదు. జీవితంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా వుంటే.. అయిదు తరాలకు సరిపడా సంపాదించుకోవడం నేటి రాజకీయ నీతి.కానీ, ఐదేళ్ళు ఎమ్మెల్యేగావుండి, సొంత ఆస్తుల్ని అమ్ముకొని అప్పులపాలైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కానీ తాను అవేం పట్టించుకోకుండా జనం సేవలో తరించి, జన సంక్షేమమే ధ్యేయంగాముందుకు సాగాడు. జనంతో మమేకమై నియోజక వర్గం అభివద్ధి కోసం పాటుపడ్డాడు. తన నియోజకవర్గంలో రూ. 4 లకే భోజనం పెట్టే పథకాన్ని మొబైల్ క్యాంటీన్ల ద్వారా ప్రారంభించారు ఆర్కే. మంగళగిరి నియోజకవర్గంలో ఈ క్యాంటీన్లు ద్వారా పేదలకు భోజనాన్ని అందించడం మొదలు పెట్టాడు.
గౌతమిబుద్ద రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ లో తొలి పదిరోజులు, మిగిలినరోజులు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ లో ఈ క్యాంటీన్ ద్వారా భోజనం పేదలకు అందించారు. రూ.4 లకే అన్నం, కూర , పప్పును , 4 రోజుల పాటు కోడిగుడ్డు, మూడు రోజులపాటు అరటిపండు, వడియాలు, వాటర్ ప్యాకెట్ లను అందించారు. రోజూ ఐదువందల మందికి భోజనాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్న ఈ ఎమ్మెల్యే, పేదల భోజనానికి తన స్వంత డబ్బులను వెచ్చిస్తున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ,రైతుల కష్టనష్టాలు తెలిసినవాడు. రాజధాని కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ ప్రయత్నం చేసినప్పుడు ,రైతులకు అండగా నిలిచాడు. ధర్మంకోసం, న్యాయం కోసం నిరంతరంగా పోరాడాడు. వైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంగళగిరి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టే, ‘ఆళ్ళ’ కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. వచ్చే వారంలో జరిగే జగన్ క్యాబినెట్‌లో ఆర్కే వ్యవసాయ శాఖ మంత్రి కాబోతున్నారని సమచారం.