గవర్నర్ నరసింహన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతిఒక్క లబ్దిదారుడికి అందేలా చూడాలని కోరారు.బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.
