సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ వెన్నెముకకు ఆపరేషన్ జరిగింది. మే 14న వారణాసిలో మురళీమోహన్ అమ్మగారి అస్థికలను గంగానదిలో కలపడానికి వెళ్లారు. అక్కడ రెండు కాళ్లకు సమస్య వచ్చి నడవలేని స్థితికి చేరుకున్నారు. వారణాసి నుండి వెంటనే హైదరాబాద్ చేరుని కేర్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. చెకప్ చేసిన డాక్టర్స్ వెన్నెముకలోని ఎల్4, ఎల్5, ఎల్6 వద్ద నరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, తర్వగా ఆపరేషన్ చేయాలని సూచించారు. డాక్టర్స్ పర్యవేక్షణలో మే 24న కేర్ ఆసుపత్రిలో ఆపరేషన్ విజయ వంతంగా ముగిసింది. జూన్ 7న కుట్లు తీయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్నమెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు మురళీమోహన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తనకు ఆపరేషన్ జరిగిన విషయాన్ని వివరిస్తూ మురళీమోహన్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ నెల 10 తర్వాత ఆరోగ్యం కుదుటపడితే తానే రాజమండ్రిలోని సన్నిహితులు, పార్టీ వర్గాలను , అభిమానులను కలుసుకుంటానని, అలా కాకుండా ఇంకా సమయం పట్టేట్లు ఉంటే ఒక్కొక్కరుగా వచ్చి నన్ను కలవవచ్చునని ఆయన సూచించారు.