సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతన్నలకు తీపికబురు అందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు బంధు సాయాన్ని రూ.5వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు బంధు పథకం సాయం పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇకపై రైతుకు ఏడాదికి రూ.10వేలు అందించనుంది. ఖరీఫ్, రబీ పంటలకు పెట్టుబడి సాయం కింద చెరో ఐదు వేల రూపాయలు చొప్పున అంటే మొత్తం పదివేలు అందించనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రైతు బంధు సాయాన్నిపెంచడం పట్ల రాష్ట్రంలోని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
