రాజకీయ పార్టీల్లో ఇలాంటివారు ఉండడం ఒక ఎత్తయితే.. ప్రజలు వారిని ఆదరించి గెలిపించడమే నిజమైన ప్రజాస్వామ్యం. అసలు ఎవరీయన.? ఏమిటి ఈయన గొప్పదనం.? ఈయన పేరు ప్రతాప్ చంద్ర సారంగి, అలియాస్ మోడీ బాలాసోర్(ఒడీస్సా మోదీ), ఉండేది ఒడీస్సా రాష్ట్రంలో, పోటీ చేసింది బాలాసోర్ నియోజకవర్గం MPగా, ఈయన నేపధ్యం ఫోటోలు చూస్తే సరిపోతుంది.. ఫోటోలో ఉన్నది అయన ఇల్లు.. సరిగా ఇంటి పైన గడ్డికూడా లేదు.. భుజానికి సంచి, కాళ్లకు ఆకు చెప్పులు తప్ప ఏమీ వేసుకోరు. 365 రోజులు ఆయన్ను ఎప్పుడు చూసినా ఇలాగే కనిపిస్తారు. ప్రజా ప్రతినిధికి వాహనం లేకపోతే ఎలా అనుకున్నారా.? ఆయనకు ఒక సైకిల్ ఉంది.. తనకున్నదానిలో ఏముంటే అది పంచేస్తూ ఉంటారు.
చిన్నపిల్లలతో ఆడుకుంటారు. ఒరిస్సాలో MLAగా రెండుసార్లు గెలిచారు.. మారుమూల తండాలకు కాలినడక వెళుతుంటారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ కనిపిస్తారు. ఎవరు ఏంపెట్టినా సంతోషంగా తినేస్తారు. రాత్రి ఆలస్యమైతే ఏ గుడిసెముందో
కుక్కి మంచం వేయించుకుని పడుకుంటారు. తన ప్రయాణాలు మొత్తం సైకిల్‌పై సాగిస్తుంటారు.. గతేడాది ఈయన తల్లి మరణించే వరకు ఆమెతో కలిసి ఓ చిన్న గదిలోనే నివాసమున్నారు. ఆదివాసీ ప్రాంతమైన మయూర్ భంజ్, బాలాసోర్‌లలో పాఠశాలలు నెలకొల్పారు. సామాజిక న్యాయంకోసం పోరాటం చేసారు. మద్యం, అవినీతి, పోలీసుల దురాగతాలపై ఉద్యమించారు. ఎన్నికల్లో కూడా సైకిల్, ఆటోలోనే ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచాక కూడా తన బ్యాగును తానే సర్దుకుని ఢిల్లీకి వెళ్లారు.. ప్రజాజీవితంలో తన వ్యక్తిగత డబ్బు పదిలక్షలు మాత్రమే ఉంది.
ఇలాంటి నిరాడంబరత గుర్తించిన BJP కేంద్ర నాయకత్వం MPగా బాలాసోర్ పార్లమెంట్ స్థానంనుండి నిలబెట్టింది. గతఎన్నికల్లో ఓడిపోయిన ఈయన ఈసారి నవీన్ పట్నాయక్ హవాలోనూ 13 వేల ఓట్లతో గెలిచారు. గెలవడమే కాకుండా కేంద్రమంత్రి అయ్యారు. ఈయనగురించి ఒక్కముక్కలో చెప్పాలంటే సారంగి ఓ సన్యాసి.. గతంలో సన్యాసులు రాజకీయాల్లో ఎందుకు.? వాళ్ళకు ప్రజలకష్టాలు ఏం తెలుసు అనుకునేవారు..? కానీ.. సారంగిలాంటి సన్యాసులకి టికెట్లు ఇచ్చి ఎంపీలుగా చేస్తుంటే.. పెళ్ళాం పిల్లలతో ఉండేవారికంటే.. డబ్బుకోసం, వ్యాపారాలకోసం రాజకీయాల్లోకి వచ్చేవారికంటే ఇలాంటివారే ప్రజల కష్టాలని అర్ధం చేసుకుంటారనేది బీజేపీ అధిష్టానం అభిప్రాయం. ఇతరపార్టీలు కూడా ఇలాంటి సామాన్యులకు టిక్కెట్లు ఇస్తే దేశం బాగుపడుతుందని, ప్రజాస్వామ్యం పరిమళిస్తుందనేది ప్రజలవాదన.