హైదరాబాద్ లో ఒక ఎంపీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారారు.ఈ ఫీట్ చేసిన వ్యక్తి మరెవ్వరో కాదు ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.శుక్రవారం సాయంత్రం పాతబస్తీలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.అదేసమయంలో అటునుండి అసదుద్దీన్ వెళ్తున్నారు.ఆ ట్రాఫిక్ చూసిన ఆయన తానే స్వయంగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌లా మొత్తం క్లియర్ చేసారు.ఆయనకు తోడుగా అక్కడ ప్రజలు కూడా సాయం చేసారు.అసలే రంజాన్ మాసం..దీంతో రోడ్ల మీద కూడా దుకాణాలు పెట్టుకుంటున్నారు.ఈమేరకు ఈ పండుగ సమయంలో ఈ ట్రాఫిక్ కష్టాలు తప్పవనే చెప్పాలి.ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
