అక్రమాలను సక్రమం చేసుకోవడం…తనకు నచ్చిన నిర్ణయాన్ని ఆహా ఓమో అని ప్రకటించడంలో ఆరితేరిపోయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. తన పదవి కాలంలో ఆయన చేసిన నిర్వాకానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముగింపు పలకనున్నట్లు చర్చించుకుంటున్నారు. కృష్ణా నది కరకట్టపై లింగమనేని ఎస్టేట్ లో రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ కు, న్యాయస్థానం నదుల పరిరక్షణ విషయంలో ఇచ్చిన తీర్పులకువిరుద్ధంగా జరిగిన నిర్మాణంలో ఉండి నిబంధనలను ఉల్లంగించిన చంద్రబాబుకు షాకిచ్చేలా దానిని కూల్చివేస్తారనే ప్రచారం జరుగుతోంది.
కృష్ణా రివర్ కన్జర్వెన్సీ చట్టం కింద నదికి 500 మీటర్లు లోపు ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని నిబంధన ఉంది. తెదేపా అధికారంలోకి వచ్చిన కొత్తలో జల వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు దీనిపై పెద్ద హడావుడి సృష్టించారు. ఇరిగేషన్ అధికారులతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నదీ తీరా న గల అక్రమ కట్టడాలను పరిశీలించారు. గుంటూరు జిల్లాలో 18, కృష్ణా జిల్లాలో 48 అక్రమ నిర్మాణా లు ఉన్నాయని వాటిని తక్షణమే ఖాళీ చేయాల్సిం దిగా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో నోటీసులు జారీ చేయించారు. అందులో ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న తాత్కాలిక నివాసం కూడా ఉంది. దానికి కూడా అప్పట్లో నోటీసులు జారీ చేయడం జరిగింది.
చంద్రబాబు తాత్కాలిక నివాసంతో పాటు మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాల మరికొన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాలు, రాజకీయ పార్టీనేతల అతిథి గృహాలు కూడా ఉన్నాయి. అక్రమ కట్టడాలను ఖాళీ చేయకపోతే కూల్చి వేస్తామని కూడా అప్పట్లో మంత్రి దేవినేని ఉమ, అధికారులు హెచ్చరించడం జరిగింది. ఈ హడావుడి జరుగుతున్న తరుణంలోనే చంద్రబాబు నివాసానికి కృష్ణా తీరంలో గల అనువైన ప్రదేశంగా అక్రమ కట్టడంగా గుర్తించిన లింగమనేని అతిథి గృహాన్ని ఎంపిక చేశారు. దీంతో అప్పట్లో ఈ విషయం వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు నివాసాన్ని లింగమనేని అతిథి గృహానికి మార్చిన అనంతరం కృష్ణా తీరంలో నిర్మించిన అక్రమ కట్టడా ల నోటీసుల జారీని అధికారులు ప్రక్కన పెట్టడం విమర్శలకు దారి తీసింది.
అయితే, కృష్ణా నది కరకట్టపై ఉన్న మాజీ సీఎం అధికార నివాసాన్నిజగన్ వాడుతారా? లేక కూల్చేస్తారా? అనే దానిపై చర్చ జరుగుతోంది. మాజీ సీఎం అధికారిక నివాసాన్ని కూల్చేయాలని పార్టీ నుంచి డిమాండ్ ఉన్నా జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో? అనే దానిపై పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.