ఏపీలో మరికొద్ది రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరగనున్నది.ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన మంత్రి వర్గాన్ని ఈ నెల ఎనిమిదో తారీఖున విస్తరించనున్నారు. అదే రోజు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం దగ్గర ఉన్న మైదానంలో చేస్తోన్నారు.
ఈ మైదానంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక వేదికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో పాటుగా నూతన మంత్రులు,ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ కూర్చోనున్నారు. ఉదయం 8.39గం.లకు సచివాలయంలోకి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అడుగు పెట్టనున్నారు.
మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నూతన మంత్రులతో కలిసి మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు.అంతకుముందు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించునున్నారు.