శనివారం కేంద్ర హోం సహాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ నగరం సేఫ్ జోన్‌గా మారిందంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి మాటల పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అమిత్ షా… కిషన్ రెడ్డిని మందలించారు. ఇకపై ఇలాంటి కామెంట్లు మానుకోవాలని షా సూచించినట్లు సమాచారం. కాగా మంత్రి కిషన్ రెడ్డి చేసిన వాఖ్యాల పట్ల సోషల్ మీడియాలో నేటీజన్లు మండిపడుతున్నారు.
