ఏపీలో అఖండ మెజార్టీతో విజయకేతనం ఎగరవేసిన వైసీపీ…వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడ చేశాడు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయిగా మారింది. మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా కర్నూల్ జిల్లాకు సంబందించి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ ఇద్దరు ఏవరంటే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్నెహితుడు.. వరుసగా రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలిచిన డోన్ నియోజక వర్గ ఎమ్మల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అయినట్లు తెలుస్తుంది. ఆనాడు ప్రతిపక్షంలో తన లెక్కలతో టీడీపీకి చుక్కలు చూపించాడు.. అంతేగాక మంచి ఇంటిల్ జెంట్ కాబట్టి ఆర్థిక మంత్రి పదవి ఇస్తున్నారని సమచారం. అలాగే ఇదే జిల్లా నుండి మరోకరు శ్రీశైలం నియోజక వర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డికి అటవిశాఖ మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే జగన్ పార్టీ గత ఎన్నికల్లో ఈ జిల్లాలో మంచి సీట్లు గెలిచాడు..ప్రస్తుత ఎన్నికల్లో ఏకంగా క్లీన్ స్వీప్ చేశాడు. దీంతో ఖచ్చింతగా జిల్లాకు చెందిన నేతలకు పదవులు ఇచ్చి అభివృధ్ది చేయలాని సూచిస్తున్నట్లు సమచారం. చూడాలి మరి మరోక వారంలో ఎవరికి పదవులు వస్తాయో.
